- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అక్కడ పొందిన అనుభూతిని మాటల్లో చెప్పలేను.. రకుల్
దిశ, సినిమా : గడిచిన ఈ నాలుగేండ్లలో వెకేషన్ అనే మాటే మర్చిపోయానంటోంది రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవలే స్కాట్లాండ్ వెళ్లొచ్చిన ఆమె.. చాలా రోజుల తర్వాత రిలాక్స్‌డ్‌గా ఫీలయ్యానంటూ తన అభిరుచులను అభిమానులతో పంచుకుంది. ‘నాకు నీళ్లంటే ప్రాణం. విహారానికి వెళ్తే సముద్ర తీరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తా. కెరటాలతో సయ్యాటలు, సముద్రంలో స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, జెట్ స్కీయింగ్ వంటి సాహసాలు చేయడం అంటే చాలా సరదా. నాకు వానల్లో విహారం చేయడం నచ్చదు. ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లినప్పుడు వానపడితే ఎంజాయ్ చేయలేం. కాకపోతే వానకాలం గోవా సముద్ర తీరానికి వెళ్లడానికి ఇష్టపడతా. చిరుజల్లుల వేళ లోనావాలా-ముంబై జర్నీ అద్భుతంగా ఉంటుంది. ఇప్పటి వరకూ నేను వెళ్లిన విహార కేంద్రాల్లో ఫిన్లాండ్ బాగా నచ్చింది. అక్కడి ప్రకృతి రమణీయత నన్ను కట్టిపడేసింది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో గడ్డకట్టిన జలపాతాలను చూసినప్పుడు ఆ థ్రిల్ మాటల్లో చెప్పలేనిది’ అంటూ చాలా ముచ్చట్లు చెప్పుకొచ్చింది.