ఇంకా మారరా.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

by samatah |   ( Updated:2023-05-11 06:23:37.0  )
ఇంకా మారరా.. రకుల్ ప్రీత్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం నటనతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ప్రస్తుతం ఈ అమ్ముడుకు తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ చెక్కేసింది.

ఇక ప్రస్తుతం రకుల్ తమిళ్లో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కాజల్ అగర్వాల్ తో పాటు తాను కూడా అవకాశం దక్కించుకుంది. మరొకవైపు శివ కార్తికేయన్ సరసన నటించిన అయిలాన్ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి షాకింగ్ కామెంట్స్ చేసింది.

హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్లకు పారితోషకం చాలా తక్కువగా ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే హీరో హీరోయిన్ల ప్రతిభను బట్టి పారితోషకాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. రెమ్యూనరేషన్ విషయంలో మార్పు అనేది ఎప్పుడు వస్తుందో, ఏ సినిమా కోసమైనా హీరో లానే హీరోయిన్‌కూ కష్టపడుతుంది. మరి ఈ వత్యాసం ఎందుకు ఇక నైనా మారరా అంటూ పలు ఇండస్ట్రీలపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం రకుల్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read:

ఆ జ్ఞాపకాలు నా మదిలో పదిలంగా ఉంటాయి: ‘సత్యప్రేమ్ కీ కథ’పై కియారా

Advertisement

Next Story

Most Viewed