సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న ‘సప్త సాగరాలు దాటి’ ట్రైలర్

by Prasanna |   ( Updated:2023-10-06 08:45:58.0  )
సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్న ‘సప్త సాగరాలు దాటి’ ట్రైలర్
X

దిశ, సినిమా : కన్నడ హీరో రక్షిత్‌ శెట్టి, హేమంత్‌ ఎం.రావు కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘సప్త సాగరాలు దాటి’. రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా నుంచి రీసెంట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కన్నడ చిత్రం ‘Sapta Sagaradaache Ello’కు రీమేక్‌గా తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో వస్తు్న్న ట్రైలర్‌ను స్టార్ హీరో నాని డిజిటల్‌గా లాంచ్ చేశాడు.

‘మొన్న ఎంత మంచి కల వచ్చిందో తెలుసా. మా ఊరిలో సముద్రం ఉంది కదా.. నిన్నక్కడికి తీసుకెళ్లాను. అక్కడ చుట్టుపక్కల ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు మను. ఆ బీచ్‌లో నువ్వు, నేను మాత్రమే ఉన్నాం’ అనే అమ్మాయి బ్యాగ్రౌండ్ వాయిస్‌తో ట్రైలర్‌ మొదలైంది. ఇక అనుకోని కారణాల వల్ల హీరో జైలుకు వెళ్లడం, ఆ తర్వాత వాళ్ల లవ్ స్టోరీ ఎలాంటి టర్న్‌లు తీసుకుందనేది సస్పెన్స్‌లో పెడుతూ కట్‌ చేసిన ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఇక ఈ ప్రేమ కథ సెప్టెంబర్ 22న తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది.

ఇవి కూడా చదవండి : Chandrababu Naidu అరెస్ట్‌తో ఇండస్ట్రీకేంటి సంబంధం..! స్టార్ హీరో సోదరుడు కీలక వ్యాఖ్యలు

Advertisement

Next Story