Kalki 2898 AD : కల్కి మూవీపై రజినీకాంత్ ఆసక్తికర రివ్యూ.. ఏమన్నారంటే

by Kavitha |   ( Updated:2024-06-29 08:05:42.0  )
Kalki 2898 AD : కల్కి మూవీపై రజినీకాంత్ ఆసక్తికర రివ్యూ.. ఏమన్నారంటే
X

దిశ, సినిమా: ‘ కల్కి 2898AD’ సినిమా థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్ తో సందడి చేస్తుంది. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ని పొగిడేస్తున్నారు. అలాగే కలెక్షన్ల పరంగా అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా నాగ్ అశ్వీన్‌ని మిగతా మూవీ టీమ్‌ని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా కల్కి సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్‌లో.. కల్కి మూవీ చూశాను. వావ్ అద్భుతమైన సినిమా. డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఇండియన్ సినిమాని వేరే లెవెల్‌కి తీసుకెళ్లారు. నా ఫ్రెండ్ అశ్విని దత్ , అమితాబ్ బచ్చన్, ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే మిగిలిన టీమ్ అందరికీ నా అభినందనలు. పార్ట్ 2 కోసం ఆత్రుతగా చూస్తున్నాను అంటూ పోస్టు పెట్టారు. అయితే రజినీకాంత్ ట్వీట్‌పై డైరెక్టర్ నాగ్ అశ్వీన్ స్పందిస్తూ..మాటల్లేవు సార్.. మా టీమ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అంటూ రిప్లై ఇచ్చారు. ఇక కల్కి సినిమాపై రజినీకాంత్ సైతం స్పందించి ఈ మూవీ గురించి గొప్పగా చెప్పడంతో అభిమానులు మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed