ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ర‌జినీకాంత్‌.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘వెట్టైయన్’ ప్రివ్యూ వీడియో

by sudharani |
ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ర‌జినీకాంత్‌.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘వెట్టైయన్’ ప్రివ్యూ వీడియో
X

దిశ, సినిమా: సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘వెట్టైయన్- ద హంట‌ర్‌’. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శక‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై సుభాస్కర‌న్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో అమితాబ్ బ‌చ్చన్‌, మంజు వారియ‌ర్‌, ఫ‌హాద్ ఫాజిల్‌, రానా ద‌గ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్‌, దుషరా విజ‌య‌న్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ‘వెట్టైయన్- ద హంట‌ర్‌’ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ ప్రివ్యూ వీడియోలో ‘పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోని టాప్ మోస్ట్ సీనియ‌ర్ ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్‌ల ఫొటోలు చూపిస్తూ.. ఈ ఆఫీస‌ర్స్ ఎవ‌రో మీకు తెలుసా! అని స‌త్యదేవ్ (అమితాబ్ బ‌చ్చన్‌) అడుగుతారు. వీళ్లు పేరు మోసిన ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ అని ట్రైనింగ్‌లోని ఓ ఆఫీస‌ర్ స‌మాధానం చెబుతారు. ‘ఈ దేశంలో ల‌క్షలాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్లని మాత్రం చూడ‌గానే గుర్తుప‌డుతున్నారంటే!.. అదెలా సాధ్యం’ అని మ‌ళ్లీ ప్రశ్నవేయ‌గా.. ట్రైనింగ్ తీసుకుంటోన్న మ‌రో లేడీ ఆఫీస‌ర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ని భ‌య‌ప‌డ‌కుండా ఎన్‌కౌంట‌ర్స్ చేయ‌టం వ‌ల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని స‌మాధానం చెబుతుంది. అప్పుడు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మన హీరో వెట్టైయన్ (రజినీకాంత్) ఎంట్రీ ఉంటుంది. ఇందులో ర‌జినీకాంత్‌ గన ఫైర్ చేస్తూ ఎంతో ప‌వ‌ర్‌ఫుల్‌గా కనిపించాడు. ‘ఎన్‌కౌంట‌ర్ అనేది నేరం చేసిన వాళ్లకు విదించే శిక్ష మాత్రమే కాదు.. ఇక మీదట ఇలాంటి నేరం మళ్లీ జరగకూడదు అని తీసుకునే ముందు జాగ్రత్త చర్య’ అని సూపర్ స్టార్ రజినీ కాంత్ చెప్పిన డైలాగ్ ఇందులో హైలెట్‌గా నిలిచింది. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది.

Next Story

Most Viewed