మోడీ ప్రమాణ స్వీకారానికి సౌత్ స్టార్‌ హీరో రజినీకాంత్‌కు ఆహ్వానం

by Satheesh |   ( Updated:2024-06-09 10:21:25.0  )
మోడీ ప్రమాణ స్వీకారానికి సౌత్ స్టార్‌ హీరో రజినీకాంత్‌కు ఆహ్వానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం థర్డ్ టైమ్ మోడీ భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మోడీతో పాటు మరో 50 మంది కేంద్ర మంత్రులు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక, మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోన్న ఎన్డీఏ కూటమి వివిధ దేశాధినేతలతో పాటు దేశంలోని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దాదాపు 8 వేల మందిని మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గెస్ట్‌లుగా పిలిచినట్లు సమాచారం. ఇందులో భాగంగానే సౌత్ స్టార్ హీరో, తలైవా సూపర్ స్టార్ రజినీ కాంత్‌కు సైతం మోడీ ప్రమాణ స్వీకారానికి రావాల్సిందింగా ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రజినీ కాంత్ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రజినీ కాంత్ అక్కడ మీడియాతో మాట్లాడారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ చార్రిత్మాక ఘట్టానికి తాను హాజరవుతున్నట్లు రజినీ వెల్లడించారు.

Advertisement

Next Story