- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజినీకాంత్ హెల్త్ బులిటెన్
దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ఇటీవల తీవ్ర అనారోగ్యం పాలయ్యి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు గురువారం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. సెప్టెంబర్ 30న ఛాతిలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన రజినీ.. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుల బృందం, గుండె నుండి బయటికి వచ్చే రక్తనాళంలో వాపు ఉన్నట్లు గుర్తించారు. ట్రాన్స్ కాథెటర్ విధానం ద్వారా చికిత్స చేసి స్టెంట్ అమర్చారు. వైద్యుల సూచన మేరకు అప్పటి నుండి అబ్జర్వేషన్లో ఉన్నారని, త్వరగానే కోలుకుంటున్నారని రజినీకాంత్ భార్య లత వివరాలు వెల్లడించారు. అయితే రజినీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉండటంతో శుక్రవారం ఆయనను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. మరోవైపు తమ అభిమాన నటుడు రజినీకాంత్ అనారోగ్యం పాలయ్యారని తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. త్వరగా కోలుకోవాలని వారంతా సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.