రజనీకాంత్‌పై సంచలన కామెంట్స్ చేసిన చిన్నకుమార్తె సౌందర్య రజనీ.. మా నాన్నకు బిల్డప్ అంటూ?

by Anjali |
రజనీకాంత్‌పై సంచలన కామెంట్స్ చేసిన చిన్నకుమార్తె సౌందర్య రజనీ.. మా నాన్నకు బిల్డప్ అంటూ?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజనీ.. తండ్రితో కలిసి పదేళ్ల క్రితం ఒక విజువల్ ఎఫెక్ట్ చిత్రం యానిమేషన్ బొమ్మల సినిమా కొచ్చాడియాన్ తెరకెక్కించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది. ఫలితంగా డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని నష్టాలు ఎదురయ్యాయి. తాజాగా సౌందర్య రజనీ ఓ ఇంటర్వ్యూకు హాజరై.. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణమేంటో చెప్పుకొచ్చింది. నిజానికి ఈ సినిమా స్టోరీ రాసుకున్నప్పుడు రజనీ పాత్రను కేవలం 10 మినిట్స్ మాత్రమే అనుకున్నాం.

కానీ రజనీ లాంటి సూపర్ స్టార్ ను 10 నిమిషాలకు మాత్రమే పరిమితం చేస్తే బాగోదని ఇంకాస్త పెంచాం. అప్పుడే మేము అనుకున్న ఒరిజినల్ స్టోరీ దెబ్బతిన్నది. రజనీకాంత్ ఉన్నప్పుడు ఫైట్లు, ఎంట్రీ గట్రా బిల్డప్‌లు లేకుంటే అభిమానులు నిరాశ చెందుతారని దీంతో ఫైట్స్, ఎంట్రీ సీన్ పెట్టామని. ఫలితంగా కథ మొత్తం సైడ్ ట్రాక్ అయిపోయింది. విష్ణు విశాల్ సహా చాలా మంది పత్రాలు, మేము చెప్పాలనుకున్న పాయింట్ హైలైట్ కాలేదని తాజాగా రజనీ చిన్న కుమార్తె చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed