- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్యాసి అనే గౌరవంతోనే Yogi Adityanand కాళ్లు మొక్కిన Rajni Kanth.. ఫ్యాన్స్ వైరల్ ట్వీట్స్..
దిశ, సినిమా: తాజాగా యోగీ ఆదిత్యనాథ్ కాళ్లకు సూపర్ స్టార్ రజినీకాంత్ నమస్కరించడంతో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. రజనీకాంత్‌కి 72 ఏళ్లు అని.. యోగి ఆదిత్యనాథ్ వయసు 51.. తనకంటే వయసులో చిన్నవాడైన అతని కాళ్లకు రజనీకాంత్ మొక్కడమేంటని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొంత మంది ‘ఉత్తరాదికి వెళ్లిన రజనీకాంత్ దక్షిణాది ప్రజల పరువు తీసేశారని’ ట్వీట్లు చేస్తున్నారు. ఇక రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్ అయితే ఆయన సినిమాలోని కొన్ని సీన్లను ఉదాహరణగా చూపిస్తూ ట్రోల్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఈ విషయాలపై రజనీకాంత్ అభిమానులు భగ్గుమంటున్నారు. ‘రజనీకాంత్ గురించి తెలియని మూర్ఖులు ఈ విధంగా ఆయన గురించి మాట్లాడుతూ..ఇలాంటి ట్రోల్స్ చేస్తారు. యోగీ ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అనో, లేదంటే బీజేపీ పార్టీకి చెందిన వ్యక్తి అనో రజనీకాంత్ ఆయన కాళ్లు మొక్కలేదు. ఆయన ఒక సన్యాసి కాబట్టి మొక్కాడు. హిందూ ధర్మాన్ని పవిత్రంగా భావించే, గౌరవించే వ్యక్తిగా రజిని ఒక యోగి కాళ్లకు నమస్కరించాడు. గతంలో కూడా తన కన్నా వయసులో చిన్నవాడైన ఒక సన్యాసి కాళ్లను రజనీకాంత్ మొక్కాడు. మరి అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి’ అంటూ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా షేర్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి : ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రం ‘కింగ్ ఆఫ్ కొత్త’ ..