‘RRR’కు బిగ్ సర్‌ప్రైజ్.. 150 టెస్లా కార్లతో అదిరిపోయే ప్రదర్శన

by sudharani |   ( Updated:2023-03-22 05:19:29.0  )
‘RRR’కు బిగ్ సర్‌ప్రైజ్.. 150 టెస్లా కార్లతో అదిరిపోయే ప్రదర్శన
X

దిశ, సినిమా : ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బృందానికి ప్రముఖ కార్ల కంపెనీ టెస్లా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇటీవలే ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దీంతో మూవీపై వివిధ రూపాల్లో ప్రేక్షకులు అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో 150 టెస్లా కంపెనీ కార్లతో ‘RRR’ అనే ఆకృతిలో ఇంగ్లీష్ పదాలను పేర్చి ప్రదర్శన చేసి జనాలను ఆకట్టుకుంది.

అంతేకాదు కళ్లు మిరిమిట్లుగొలిపే రీతిలో లైటింగ్‌తో పాటకు తగ్గట్టు అద్భుత ప్రదర్శన చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను నెట్టింట షేర్ చేసిన దర్శకుడు రాజమౌళి... ‘న్యూజెర్సీ నుంచి #నాటు నాటుకు ట్రిబ్యూట్.. నిజంగా ఆనందంతో ఉప్పొంగిపోయాను! థాంక్యూ @vkkoppu, #NASAA, @@peoplemediafcy.. ఈ అద్భుతమైన టెస్లా లైట్ షో ప్రదర్శన ప్రతి ఒక్కరినీ అనందింపజేసింది. #RRR movie @elonmusk’ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Advertisement

Next Story

Most Viewed