Rajamouli: లక్ష కోసం ఇబ్బంది పడితే ఆయన సహాయం చేసారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి

by Prasanna |   ( Updated:2024-09-29 09:22:19.0  )
Rajamouli: లక్ష  కోసం ఇబ్బంది పడితే  ఆయన సహాయం చేసారంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన  రాజమౌళి
X

దిశ , వెబ్ డెస్క్ : దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను ఒక సినిమా చేస్తే పారితోషికం భారీగా తీసుకుంటాడన్న విషయం మనకీ తెలిసిందే. ఒక్కో మూవీకి రూ. 100 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అయితే, స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు రాక ముందు వరకు డబ్బు పరంగా అనేక ఆర్ధిక సమస్యలు ఎదుర్కొన్నాడు.

అయితే, జక్కన్న ఒక సమయంలో లక్ష రూపాయల కోసం ఇబ్బంది పడితే డైరెక్టర్ రాఘవేంద్రరావు హెల్ప్ చేశారని రాజమౌళి ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. అక్క అమెరికాలో గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ అమెరికాకు వెళ్లి రావడానికి లక్ష రూపాయలు అవసరం అని ఆ సమయంలో రాఘవేంద్రరావు గారిని లక్ష రూపాయలు అడిగానని రాజమౌళి తెలిపారు.

Advertisement

Next Story