ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

by Prasanna |   ( Updated:2024-08-27 15:28:50.0  )
ఓటీటీలోకి వస్తోన్న రాజ్ తరుణ్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి తెలుగు హీరో రాజ్ తరుణ్ పేరు మారుమోగుతుంది. మొన్నటి వరకు వ్యక్తిగత విషయాలతో సతమత అయి నిత్యం వార్తల్లో నిలిచాడు. ఒక పక్క ఇబ్బంది పడుతూనే మరో వైపు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. కొంత కాలం గ్యాప్ తీసుకుని పురుషోత్తముడు అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. జూలై 26న థియేటర్లలో సందడీ చేసిన ఈ మూవీ అనుకున్నంత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాకి రామ్ భీమన దర్శకత్వం వహించారు. అయితే, తాజాగా ఈ మూవీకి సంబందించిన ఓ వార్త బయటకు వచ్చింది. థియేటర్లలో మెప్పించలేకపోయిన పురుషోత్తముడు మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసారు. ఆగస్ట్ 29న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఆహా ట్విట్టర్ వేదికగా డేటును అధికారికంగా ప్రకటించింది.

తరుణ్ సరసన హాసినీ సుధీర్ హీరోయిన్ గా నటించింది. మురళీశర్మ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీశ్రీదేవి ప్రొడక్షన్ పతాకం పై రమేశ్ తేజవత్, ప్రకాష్ తేజవత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించగా గోపీ సుందర్ సంగీతం అందించారు.

Advertisement

Next Story