Hero Raj Tarun: మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్.. ‘భలే ఉన్నాడే’

by Prasanna |   ( Updated:2024-08-16 14:23:59.0  )
Hero Raj Tarun: మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్న రాజ్ తరుణ్.. ‘భలే ఉన్నాడే’
X

దిశ, సినిమా : లావణ్య ప్రేమ వ్యవహారం వల్ల రాజ్ తరుణ్ చాలా ఫేమస్ అయ్యాడు. ఎందుకంటే అంతక ముందు వరకు మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి మాత్రమే తెలుసు. కానీ, ఇప్పుడు దేశం మొత్తం ఇతని వైపే చూస్తుంది. తప్పు చేసాడని లావణ్య అంటుంది.. నేను ఏ తప్పు చేయలేదు .. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని రాజ్ తరుణ్ చెబుతున్నాడు. ఇలా ఒక వైపు వివాదాల మధ్య నలుగుతూనే ఉన్నాడు ఇంకో వైపు సినిమాల మీద సినిమాలను రిలీజ్ చేస్తున్నాడు.

ఇటీవలే జూలై 26 న పురోషోత్తముడు, ఆగస్టు 2 న తిరగబడసామి మూవీ ఆడియెన్స్ ముందుకొచ్చింది. తాజాగా, ఇప్పుడు మరో మూవీతో మన ముందుకు రాబోతున్నాడు. శివసాయివర్ధన్‌ డైరెక్షన్లో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న మూవీ ‘భలే ఉన్నాడే’.

ఆగస్టు 15 సందర్భంగా విడుదల విడుదల డేటును కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మూవీని వినాయకచవితి పండుగ కానుకగా సెప్టెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ , టీజర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రవికిరణ్ ఆర్ట్స్, మారుతి టీమ్ పతాకం పై N.V. కిరణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీలో మ‌నీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed