Brahmamudi September 18th Episode: : కావ్యకు సపోర్ట్ చేసిన రాజ్..

by Prasanna |   ( Updated:2023-09-18 06:16:29.0  )
Brahmamudi September 18th Episode: : కావ్యకు సపోర్ట్ చేసిన రాజ్..
X

దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇందిరా దేవి దగ్గరకు రాజ్ వెళ్లి..నాకు భయంగా ఉంది నానమ్మ, ఈ ఇంటిలో ఎన్ని కష్టాలు వచ్చిన అమ్మ ఇప్పటి వరకు విడిగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదంటూ బాధ పడతాడు. అప్పుడు ఇందిరా దేవి ‘కావ్య తప్పు చేసిందని మీ అమ్మ అనుకుంటోంది. ఆలాగే ఈ విషయంలో తన వైపు ఎవ్వరూ నిలబడలేదనే కోపంతో ఇలాంటి నిర్ణయం తీసుకుంది’ అని రాజ్ తో అంటుంది.

అసలు తన వైపు ఎలా నిలబడతాం నానమ్మ.. అప్పుడు కళావతికి అన్యాయం చేసినట్టు కదా.. అలా నేను ఎలా చేయగలను.కళావతి ఓ మంచి పని చేసింది. అది కూడా నాకు చెప్పే చేసింది. అలాంటప్పుడు నేను అమ్మ వైపు ఎలా నిలబడాలి? ఎలా సపోర్ట్ చెయ్యగలను? అలా చేసినా రేపు కళావతి ఏదైనా తప్పు చేసినప్పుడు.. తిరిగి నేను ప్రశ్నించగలనా? నీ తల్లికో న్యాయం.. నాకో న్యాయామా? అంటే ఏం చెప్పగలను?’ అని అంటాడు రాజ్.

Advertisement

Next Story