షారుఖ్‌ను వెనక్కి నెట్టేసిన రాశీ ఖన్నా.. ఇది ఆశ్చర్యమే!

by Vinod kumar |
షారుఖ్‌ను వెనక్కి నెట్టేసిన రాశీ ఖన్నా.. ఇది ఆశ్చర్యమే!
X

దిశ, సినిమా: వీక్లీ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌ను రిలీజ్ చేసింది IMDb. ఈ లిస్ట్‌లో బ్యూటీఫుల్ రాశీ ఖన్నా ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా.. సెకండ్ పొజిషన్‌లో షారుఖ్ ఖాన్ ఉండటం విశేషం. మొత్తానికి గ్లోబల్లీ ట్రెండింగ్ ఇండియన్ స్టార్స్‌లో టాప్ ప్లేస్ అందుకున్న రాశీ.. ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతుంది. పైగా షారుఖ్‌ను దాటేసి మొదటి స్థానం సొంతం చేసుకోవడాన్ని నమ్మలేకపోతున్నాను అంటోంది. ఇక ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో వరుసగా విజయ్ సేతుపతి, రెజీనా, ఆదిత్యా చోప్రా, దీపికా పదుకొణే, కదీర్ ఖాన్, భువన్ అరోరా, అనుపమ్ ఖేర్, కియారా అద్వానీ ఉన్నారు. కాగా రీసెంట్ వెబ్‌సిరీస్ 'ఫర్జీ' ద్వారా సూపర్ సక్సెస్ అందుకున్న రాశీ.. దీని కారణంగానే టాప్ ప్లేస్ దక్కించుకుని ఉంటుందంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

Next Story