MEGASTAR CHIRANJEEVI: చిరంజీవిని అలా పిలుస్తూ PV సింధు స్పెషల్ పోస్ట్

by Anjali |
MEGASTAR CHIRANJEEVI: చిరంజీవిని అలా పిలుస్తూ PV సింధు స్పెషల్ పోస్ట్
X

దిశ, సినిమా: పారిస్‌లో ఒలంపిక్స్ గ్రాండ్‌గా జరుగుతోన్న విషయం తెలిసిందే. పారిస్ ఒలంపిక్స్ కు మెగాస్టార్ చిరంజీవి, సతీమణి సురేఖ, ఉపాసన, రామ్ చరణ్.. వీరితో పాటు బుజ్జాయి క్లింకారను కూడా తోడు తీసుకెళ్లి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. గత మూడు రోజులుగా మెగా ఫ్యామిలీ పారిస్‌ను చుట్టుముడుతున్నారు. పారిస్ ఒలంపిక్స్‌లో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు రామ్ చరణ్, ఉపాసన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. ఇకపోతే ఈ ఒలంపిక్స్‌లో ఇప్పటికే రెండు మెడల్స్ సాధించిన పి. వి సింధు ఆడుతుంది. ఈసారి కూడా ఎలాగైన విజయం సాధించాలని గట్టి పట్టుతో ఉంది.

ఒలంపిక్స్‌కు వెళ్లిన మెగా ఫ్యామిలీ పి. వి సింధుతో మాట్లాడారు. దగ్గరుండి మరీ మెగాస్టార్ చిరంజీవి సింధును ప్రోత్సహించడం నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇది చిరంజీవి గొప్పతనం అంటూ మెగా అభిమానులు చిరుపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సింధు కూడా ఫస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించింది. మొదటి మ్యాచ్ ముందు నుంచి .. మెగా ఫ్యామిలీ తనతోనే ఉంది చాలా ప్రోత్సహించారు. ప్రస్తుతం సింధుతో ఉన్న ఫొటోలను కూడా ఉపాసన నెట్టింట పంచుకుంది. ఇకపోతే తాజాగా

పి. వి సింధు.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘చిరు అంకుల్ అండ్ ఫ్యామిలీ మొత్తం రావడం నాకు నిజంగా సర్ ప్రైజ్‌గా ఉంది. పైగా క్లింకారతో వచ్చారు. చిరంజీవి అంకుల్ లా చాలా తక్కువ మంది ఉంటారు. మాస్, క్లాస్, చార్మ్, గ్రేస్ గా ఉంటారు. ఈయన్ను సినీ ఇండస్ట్రీ గౌరవిస్తుంది. చిరు అంకుల్ మంచి యాక్టర్. ఈయనలా ఎవరు ఉండరు. అలాగే సురేఖ, ఉపాసన, రామ్ చరణ్ మీరంతా నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తులు’’ అంటూ పి. వి. సింధు రాసుకొచ్చింది. ప్రస్తుతం సింధు పోస్ట్‌కు మెగా ఫ్యాన్స్ వరుస కామెంట్లతో జోరెత్తిస్తున్నారు.

Advertisement

Next Story