అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్.. అమ్మోరు అవతార్‌లో ‘పుష్పరాజ్’

by Javid Pasha |   ( Updated:2023-04-11 12:13:49.0  )
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్.. అమ్మోరు అవతార్‌లో ‘పుష్పరాజ్’
X

దిశ, వెబ్ డెస్క్: ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఇక ఆ మూవీలోని ‘పుష్ప.. పుష్ప రాజ్.. నీ యవ్వ తగ్గేదేలే’ అనే డైలాగ్ తో బన్ని రచ్చ రచ్చ చేశాడు. అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ, మేనరిజానికి మామూలు ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 మూవీని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్ ను రిలీజ్ చేశారు. అమ్మోరు తల్లి గెటప్ లో పుష్పరాజ్ లుక్ అదిరిపోయింది. పోస్టర్ ను అలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారో లేదో వేల కొద్దీ లైక్స్, వ్యూస్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి: ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ.. కారణం అదేనంటూ ట్వీట్

Advertisement

Next Story