తన నెక్ట్స్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్.. పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2024-08-18 08:39:15.0  )
తన నెక్ట్స్ సినిమాపై అప్డేట్ ఇచ్చిన పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత, బుజ్జిగాడు వంటి చిత్రాలతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఆంధ్రపోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. కానీ పెద్దగా హిట్ అందుకోలేకపోయాడు. గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయ్యాడు. అయితే ఇటీవల ఆకాష్ పూరి పేరు మార్చుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆకాష్ పేరి నుండి ఆకాష్ జగన్నాథ్‌గా మారాడు. ఈ క్రమంలో.. ఫ్యాన్స్ కొంతమంది ఆకాష్ సినిమాల్లో నటించమని అప్డేట్ ఇవ్వమని నెట్టింట పలు పోస్టులు పెడుతున్నారు.

తాజాగా, ఈ స్టార్ కిడ్ ఇన్‌స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేసి తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై అప్డేట్ ఇచ్చాడు. ‘‘ చాలా రోజుల నుంచి అందరూ అడుగుతున్నారు. ఏం సినిమా చేస్తున్నావ్ అని. ఎందుకు ఏం మూవీ ప్రకటించడం లేదు. మా నాన్న ఫ్యాన్స్ నాకు సన్నిహితంగా ఉండేవాళ్లు. రెండు సంవత్సరాలు అయిపోయింది నువ్వు సినిమా చేసి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఖాళీగా ఎందుకు ఉంటున్నావు. చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. ఈ రెండేళ్లు నేను చాలా చాలా కథలు విన్నాను. ఒక గొప్ప అభిరుచిగల నిర్మాతను, అమేజింగ్ దర్శకుడితో పని చేయబోతున్నాను.

ఎక్కువ కథలు విన్నప్పుడు నేను కొంచెం ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుండేవాడిని కానీ దేవుడి దయవల్ల నేను నమ్మిన అమ్మవారి దయవల్ల ఒక మంచి టీమ్ సెట్ అయింది. ఈ సారి కొడితే గట్టిగా కొట్టాలి అనే ఉద్దేశంతో సినిమా ఫిక్స్ చేశాను. ఈ ఆగస్టు 19న పూజా కార్యక్రమాలు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ రొమాంటిక్ మూవీలో ఉన్న అటిట్యూడ్ కొత్త సినిమాలో ఉండేలా చూడమని అంటున్నారు.

Advertisement

Next Story