టికెట్ ధరల పెంపు విషయంలో రియలైజ్ అయిన నిర్మాతలు!

by samatah |   ( Updated:2023-08-07 06:16:48.0  )
టికెట్ ధరల పెంపు విషయంలో రియలైజ్ అయిన నిర్మాతలు!
X

దిశ, సినిమా: ‘RRR’ మూవీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ మొదలైంది. అంటే అప్పటివరకు కరోనా కారణంగా నష్టంలో ఉన్న ఇండస్ట్రీ వారి బడ్జెట్ బాధలు ప్రభుత్వం దగ్గర విన్నవించుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీనికి అంగీకరించారు. కానీ కొన్ని సినిమాలకు అది వర్కవుట్ అయినా మరికొన్నింటికి కాలేదు. టికెట్ రేట్లు పెంచిన తర్వాత స్టార్ హీరోల సినిమాలకు సైతం మార్నింగ్ షోస్ డీలా పడిపోయాయి. ఒకప్పుడు మార్నింగ్ షో టికెట్ కోసం ఎన్నో కష్టాలు పడాల్సివచ్చేది. కానీ ఇప్పుడు రేట్లు పెంచడంతో కౌంటర్‌లో వాళ్లే పిలిచి మరీ ఇస్తున్నారు. అంటే ఇక్కడ స్టార్ హీరోల క్రేజ్ తగ్గిందని కాదు పెరిగిన టికెట్ రేట్లతో కామన్ ఆడియన్స్ సినిమాలకు దూరం అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో రూ.295 ఉన్న టికెట్ పెరిగాక రూ.350 అవుతుంది. ఏపీలో అయితే రూ. 220 పైమాటే. ఇంత ఖర్చు పెట్టి మూవీ చూడడానికి ఎవరు రారు. అందుకే ఎక్కువగా OTTలపై మొగ్గు చూపుతున్నారు. ఇక ఇదంతా దృష్టిలోకి తీసుకుని మన నిర్మాతలు రియలైజ్ అయ్యారు. దీంతో భోళా శంకర్, జైలర్ వంటి స్టార్ హీరోల సినిమాలు నార్మల్ టికెట్ రేట్లతోనే వస్తున్నాయి.

Read More: చిరంజీవి కోసం 12 ఏళ్లు పోరాడి నీచంగా మాట్లాడిన వారిని జైలుకు పంపించా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్

Advertisement

Next Story

Most Viewed