‘నేను స్టూడెంట్ సర్’.. ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ను నిలబెడుతుంది: నిర్మాత సతీష్ వర్మ

by samatah |   ( Updated:2023-05-29 12:55:00.0  )
‘నేను స్టూడెంట్ సర్’.. ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ను నిలబెడుతుంది: నిర్మాత సతీష్ వర్మ
X

దిశ, సినిమా : ‘స్వాతిముత్యం’ సినిమాతో సక్సెస్ ఫుల్‌గా అరంగేట్రం చేసిన యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ ప్రస్తుతం ‘నేను స్టూడెంట్ సర్’తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. రాకేష్‌ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. ఎస్వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ అంచనాలు పెంచేయగా.. జూన్ 2న విడుదల కాబోతున్న ఈ మూవీ ‘నాంది’కి వచ్చిన క్రేజ్‌ను నిలబెడుతుందన్నాడు నిర్మాత. ఇందులో ఉన్న కొత్త పాయింట్.. కచ్చితంగా సినిమాను సక్సెస్ చేస్తుందని, మంచి థ్రిల్లర్ జోన్‌లో రాబోతున్న సినిమాకు బెల్లంకొండ గణేష్ చక్కగా సరిపోయారని తెలిపాడు. యూనివర్సిటీలో స్టూడెంట్ లైఫ్, ఎదురయ్యే ఇబ్బందులు వారిని ఎక్కడకు తీసుకెళ్తాయనేది చక్కగా చూపించారని చెప్పాడు.

Read More... రికార్డు సృష్టించిన చిన్న సినిమా.. కేవలం 25 రోజుల్లో రూ. 160 కోట్లు వసూళ్లు

తారక్ భార్య లక్ష్మీ ప్రణతిని దారుణంగా తిట్టిపోసిన నెటిజన్స్..

Advertisement

Next Story

Most Viewed