హాలీవుడ్‌ నటులు, రచయితల సమ్మెకు మద్దతు తెలిపిన ప్రియాంక.. పోస్ట్ వైరల్

by samatah |   ( Updated:2023-07-15 15:44:54.0  )
హాలీవుడ్‌ నటులు, రచయితల సమ్మెకు మద్దతు తెలిపిన ప్రియాంక.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : హాలీవుడ్ నటీనటుల సమ్మెకు ప్రియాంక చోప్రా తన మద్దతు తెలిపింది. నిర్మాణ సంస్థల యూనియన్ అయిన AMPTP తమ డిమాండ్స్ పట్టించుకోలేదంటూ రైటర్స్‌తోపాటు యాక్టర్స్ అసోసియేషన్ స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ SAG సమ్మేకు దిగారు. ఈ క్రమంలో తాజాగా ఈ స్ట్రైకుకు సపోర్టుగా నిలుస్తూ సోషల్ మీడియాలో స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ స్ట్రాంగ్ అంటూ ఫొటో షేర్ చేసిన నటి ‘నా యూనియన్.. నా తోటి నటులకు అండగా ఉంటాను. మేము ఒక మంచి భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. రేపటిరోజును గొప్పగా తీర్చిదిద్దుతాం’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా పెద్ద ఎత్తున్న సెలబ్రిటీలు, అభిమానులు పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ఇక లక్ష అరవై వేల మంది నటులు, పాత్రికేయులు, నృత్యకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్.. అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్ అనే రెండు US కార్మిక సంఘాలను ఒకచోట చేర్చడం విశేషం.

Advertisement

Next Story