వేడినీళ్ల బకెట్‌లో నిల్చుని సాంగ్ చేసిన హీరోయిన్.. ఇన్ని కష్టాలు పడిందా?

by sudharani |   ( Updated:2023-11-07 14:00:07.0  )
వేడినీళ్ల బకెట్‌లో నిల్చుని సాంగ్ చేసిన హీరోయిన్.. ఇన్ని కష్టాలు పడిందా?
X

దిశ, సినిమా : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న స్ట్రేంజ్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించింది. జియో MAMI ముంబై ఫిల్మ్ ఫెస్ట్‌లో పాల్గొన్న ఆమె.. స్విట్జర్లాండ్‌‌లో చలికి వణుకుతూ సాంగ్ షూట్‌లో పాల్గొన్న మెమొరీస్ గుర్తుచేసుకుంది. తాను షిఫాన్ శారీ, బ్లౌజ్‌ ధరిస్తే.. హీరో టాప్ టు బాటమ్ ఫుల్ ఆఫ్ క్లాత్స్, స్వెటర్స్‌తో కవర్ చేయబడి ఉన్నాడని చెప్పింది. అయితే ఆ మంచులో తాను నిలుచోలేకపోతుండటంతో.. కోస్టార్ హాట్ వాటర్ బకెట్‌లో నిల్చుని షాట్ పూర్తి చేద్దామని సూచించాడని, అలాగే చేశాడని తెలిపింది. ఆ విధంగా తనను వెచ్చగా ఉంచేందుకు ప్రయత్నించాడని చెప్పుకొచ్చింది.

కాగా ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ.. పలు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. కూతురు మాలతి, భర్త నిక్ జోనస్‌తో లైఫ్‌లో బ్యూటిఫుల్ మెమొరీస్ క్రియేట్ చేసుకుంటుంది. మొత్తానికి ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేసిన ఆమె.. డిఫరెంట్ రోల్స్‌తో ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. తనకు నచ్చిన పని చేస్తూ ఆస్వాదిస్తుంది.

Advertisement

Next Story