ఆ ఆలయానికి ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇవ్వని కానుక ఇచ్చిన స్టార్ హీరోయిన్..

by sudharani |   ( Updated:2024-03-18 15:48:15.0  )
ఆ ఆలయానికి ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ ఇవ్వని కానుక ఇచ్చిన స్టార్ హీరోయిన్..
X

దిశ, సినిమా: ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియమణి గురించి అందరికి తెలిసిందే. ఈ అమ్మడు అందం, నటన, డ్యాన్స్, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఇక ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు సినిమాల్లో నటిస్తున్నారు. అలాగే కొన్ని షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్‌లతో కుర్రాళ్లకు మైమరపిస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు ఓ ఆలయానికి ఏనుగును కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ విషయాల్లోకి వెళితే..

కేరళ త్రిసూర్ దగ్గరలో ఉన్న కొచ్చిలో ‘త్రిక్కయిల్ మహాదేవ ఆలయం’ ఉంది. అక్కడ భక్తులకు గజరాజులు ఆశీర్వాదాలపై నమ్మకం ఎక్కువగా ఉంటోంది. అంతే కాదు చాలా పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఏనుగులను కూడా పెంచుతూ ఉంటారు. అయితే.. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో తెలియక.. ఏనుగుల కారణంగా ప్రాణ నష్టం ఉంటోందని కొన్ని సార్లు భయభ్రాంతులకు గురవుతున్నారు భక్తులు. ఈ క్రమంలోనే అక్కడి పూజారులు రోబోటిక్ ఏనుగులు ప్రవేశ పెట్టాలని చాలా సార్లు అనుకున్నారు. ఈ మేరకు కొచ్చిలోని త్రిక్కయిల్ మహాదేవ ఆలయానికి హీరోయిన్ ప్రియమణి ఏనుగును కానుకగా ఇచ్చింది. అయితే.. ఇది వరిజినల్ ఏనుగు కాదు. రోబోటిక్ ఏనుగు. ప్రియమణి అందించిన ఆ ఏనుగకు ‘మహదేవన్’ అని పేరు కూడా పెట్టారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ.. ‘బీటా సంస్థతో కలిసి రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వివాహ వేడుకల్లో అలంకరణకు మాత్రమే వినియోగించే ఈ యాంత్రిక ఏనుగులను ఇప్పుడు దేవాలయాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇలాంటి రోబోటిక్ ఏనుగుల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story