Priyamani : హాట్ యాంకర్ అనసూయ జాడలో స్టార్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-09-22 05:46:20.0  )
Priyamani : హాట్ యాంకర్ అనసూయ జాడలో స్టార్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలోని తారలపై ట్రోల్స్ చేయడం ప్రస్తుత రోజుల్లో కామన్ అయిపోయింది. ముఖ్యంగా హీరోయిన్లపై ఎడాపెడా ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తుంటారు. వీటికి కొంతమంది స్టార్లు స్పందించి.. గట్టిగానే కౌంటర్లు ఇస్తుంటారు. మరికొంతమంది సైలెంట్‌గా ఉంటారు. ఇక బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ డ్రెస్సింగ్, విషయంలో ఎన్నిసార్లు ట్రోల్స్‌కు గురయ్యిందో స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. ఈ భామను ‘అనసూయ ఆంటీ’ అంటూ ఆకతాయి నెటిజన్లు సోషల్ మీడియాలో చాలా కాలం వేధించారు. మరీ ఈ యాంకర్ సైలెంట్‌గా ఊరుకుంటుందా? ఎప్పటికప్పుడు ఘాటుగా ట్రోలర్స్‌కు ఇచ్చిపడేస్తుంది. తాజాగా టాలీవుడ్ ప్రియమణిని కూడా జనాలు ఆంటీ అని కామెంట్ చేయడంతో ప్రస్తుతం నెట్టింట రచ్చ మొదలయ్యింది.

తాజాగా ఈ హీరోయిన్ పెట్టిన బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఓ నెటిజన్ ‘బ్లాక్ ఆంటీ’ అని నెగిటివ్ కామెంట్ పెట్టాడు. దీంతో ప్రియమణికి కోపం వచ్చి.. ‘‘ఇప్పుడు నా వయసు 38 ఏళ్లు. అయినా హాట్ గానే ఉన్నాను. ఇక నోరు మూసుకో” అంటూ ఘాటు సమాధానం ఇచ్చింది. మరోవైపు పాజిటివ్ కామెంట్స్ కూడా చేసింది. ‘నన్ను ఆంటీ అని కామెంట్‌ చేయటంలో ఎలాంటి తప్పు లేదు. ఎలాంటి అభ్యంతరం లేకుండా నన్ను ఆంటీ అని పిలవచ్చు. ఏజ్ పెరిగితే సిగ్గు పడాల్సిన అవసరం లేదు. వయసు పెరగడం అనేది సహజ సిద్ధంగా జరిగే పక్రియ’’ అని వెల్లడించింది.




For More Actress Photo galleries

Advertisement

Next Story