మళ్లీ మొదలైన ట్రోలింగ్.. లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో దర్శనమిచ్చిన ప్రీతమ్

by Jakkula Samataha |   ( Updated:2024-03-06 14:28:03.0  )
మళ్లీ మొదలైన ట్రోలింగ్.. లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో దర్శనమిచ్చిన ప్రీతమ్
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని, లక్కీ గర్ల్‌గా మారిపోయింది. తర్వాత వరసగా స్టార్ హీరోస్ అందరిసరసన నటించి టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది.

ఇక అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న తర్వాత ఈ అమ్మడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత స్టైలిష్, స్నేహితుడు ప్రీతమ్ పేరు కూడా ఎక్కువగా వినిపించింది. వీరిద్దరు రిలేషన్ షిప్ కారణంగానే సామ్, చై విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. కానీ వాటన్నింటిని ప్రీతమ్ ఖండించి, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు.

ఆతర్వాత సమంత, ప్రీతమ్ ఎక్కువగా కనిపించింది లేదు. అయితే రీసెంట్‌గా సమంత తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకుంది. అక్కడ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించుకొని.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీవారిని దర్శించుకొని వేదాశీర్వచనాలు అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తిరుమలలో సమంతతో పాటు ప్రీతమ్ కూడా దర్శనమిచ్చాడు. దీంతో మరోసారి ఇండస్ట్రీలో, నెట్టింట్లో గుస గుసలు మొదలయ్యాయి. సామ్, ప్రీతమ్ మధ్య ఉంది స్నేహమేనా, ఇంకేమైనా ఉన్నదా అంటూ ముచ్చటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed