Prema : ఉపేంద్రతో సీనియర్ హీరోయిన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన నటి!

by Jakkula Samataha |
Prema : ఉపేంద్రతో సీనియర్ హీరోయిన్ ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన నటి!
X

దిశ, ఫీచర్స్ : స్టార్ హీరోయిన్ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా దేవత, నాగిని పాత్రల ద్వారా ఈ నటి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలా రోజుల నుంచి ప్రేమకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని, వీరు గత కొన్ని రోజుల నుంచి రిలేషన్‌లో ఉన్నట్లు నెట్టింట్లో పుకార్లు షికారు చేస్తున్నాయి. కన్నడ, టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్న ఈ నటి, కెరీర్ మంచి ఫేమ్‌లో ఉన్న సమయంలోనే పారిశ్రామిక వేత్తను 2006లో వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటించింది. తర్వాత తన భర్తతో విభేదాలు రావడంతో విడాకులు ఇచ్చి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రేమకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గామారింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ, ఉపేంద్ర తో ఎఫైర్ అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది. తాను విడాకుల గురించి మాట్లాడుతూ జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం కానీ, అదే సమస్య గా మారినప్పుడు, మనం దానిని వదిలి వేయడం మంచిది. అలా నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇక ఉపేంద్రతో ప్రేమ అనేది ఏం లేదు. మేము ఇద్దరం ఎక్కువగా కలిసి మాట్లాడుకున్నదే లేదు. మరి మా మధ్య ప్రేమ ఎలా పుడుతుంది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story