- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Venumadhav: వేణుమాధవ్ కామెడీ సీన్స్‌ను బ్లాక్ బస్టర్ సినిమాగా మార్చిన స్టార్ డైరెక్టర్.. ఎవరంటే?
దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ వేణుమాధవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మిమిక్రి ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ప్రారంభించి..ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కృష్ణ హీరోగా నటించిన ‘సంప్రదాయం’ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అలా దాదాపు 400 పైగా చిత్రాల్లో తన కమెడీని పండించి.. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 2006 లో ‘లక్ష్మి’ మూవీకి ఉత్తమ కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. కానీ అనూహ్యంగా సెప్టెంబరు 25, 2019 లో కాలేయ వ్యాధి సమస్యతో అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఇదంతా పక్కన పెడితే.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనింతే’ సినిమాలో వేణుమాధవ్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్లాలని తెగ ట్రై చేస్తాడు.
కానీ వర్కౌట్ కాకపోవడంతో తన పేరును సెంథిల్ గా ఛేంజ్ చేసుకుని, తమిళ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్తాడు. మల్లిక్‌గా నటించిన సుబ్బారాజు .. వేణుమాధవ్ చెప్పే స్టోరీ వినడానికి అంగీకరిస్తాడు. ఇక ఈ కమెడియన్ తెలుగు, తమిళ్ మిక్స్ చేసి స్టోరీ చెబుతాడు. ‘‘కన్నులెంది ఒరూ జూమ్ బ్యాక్ వంద ఫస్ట్ షాట్’’ అంటూ వేణుమాధవ్ కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాడు. అయితే వేణుమాధవ్ ఫన్నీగా చెప్పిన ఈ సన్నివేశాల్నే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడంటూ నెట్టింట జనాలు కామెంట్లు చేస్తున్నారు. కామెడీ షాట్‌ను అండ్ కేజీఎఫ్ విజువల్స్‌ను కలిపి నెట్టింట ఓ వ్యక్తి పోస్ట్ చేశాడు.