ప్రభాస్‌ను కూడా వదలని ప్రణీత్ హనుమంతు ... ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

by Sujitha Rachapalli |
ప్రభాస్‌ను కూడా వదలని  ప్రణీత్ హనుమంతు ...  ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
X

దిశ, సినిమా: చిన్న పిల్లల మీద వల్గర్ జోకులు వేసుకుంటూ నవ్వుకున్న యూట్యూబ్ బ్యాచ్ ప్రస్తుతం పోక్సో చట్టం కింద బుక్ అయింది. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు రావు అండ్ కో.. అందరిచేత ఛీ అనిపించుకుంటున్నారు. కాగా ఈ మధ్య ఈ ఇన్ ఫ్లుయెన్సర్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను కూడా టార్గెట్ చేయగా.. ప్రస్తుతం ఈ టాపిక్ కూడా వైరల్ అవుతోంది. ' కల్కి ' రిలీజ్ కు ముందు దారుణమైన నెగెటివ్ కామెంట్స్ చేశాడు ప్రణీత్. ప్రభాస్ పై వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడం జోక్ అంటూ విమర్శించాడు. డిజాస్టర్ తప్పదని మూవీ రిలీజ్ కు ముందే రివ్యూ ఇచ్చేశాడు. కానీ సినిమా విడుదల అయ్యాక వచ్చిన సక్సెస్ చూసి కనీసం కనిపించలేదు. పాజిటివ్ రివ్యూ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ కల్కి మాత్రం వేయి కోట్ల క్లబ్ లో చేరే దిశగా దూసుకుపోతోంది.

కాగా ఈ విషయంపై స్పందిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ప్రణీత్ హనుమంతు రావుకు తగినశాస్తి జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. మంచి మనసున్న వ్యక్తుల జోలికి పోతే అనుభవించక తప్పదని తిడుతున్నారు. అసలు అభం శుభం తెలియని చిన్న పిల్లల మీద వల్గర్ కామెంట్స్ చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని.. ఇలాంటి వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed