- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీలో ఆ పాత్రలో బేబీ హీరోయిన్.. తెలిసే తప్పటడుగులు వేస్తుందా..?
దిశ, సినిమా: వైష్ణవి చైతన్య.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు ‘బేబీ’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్‌గా మారిపోయింది ఈ ముద్దు గుమ్మ. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ అడపా తడపా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్న చైతన్యకు దర్శకుడు రాజేష్ ‘బేబీ’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడంతో గట్టిగా ఇచ్చిపడేసింది. తన అందం నటనతో తనను తాను నిరూపించుకుంది. అలా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు అనేక సినిమాల్లో హీరోయిన్గా నటిస్తుంది.. ఇప్పటికే సిద్దు జొన్నలగడ్డ సినిమాలో, అలాగే ఆశిష్ రెడ్డి చిత్రంలో కూడా నటిస్తుండగా. ఆనంద్ దేవరకొండతో కూడా మరో చిత్రంలో నటించబోతోంది వైష్ణవి.
అయితే ఎవరైనా హీరోయిన్గా కెరీర్లో స్టార్డం అందుకునే సమయంలో.. మళ్లీ పక్క పాత్రల జోలికి వెళితే కెరీర్‌కి ఎలాంటి దెబ్బ పడుతుందో మనకు తెలిసిందే. అలా నటించిన చాలా మంది స్టార్ హీరోయిన్లు ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్నారు.. ఇందులో కీర్తి సురేష్ ఒకరు. అయితే ఇప్పుడు వైష్ణవి కూడా అలాంటి తప్పటడుగులే వస్తుంది. విషయం ఏంటి అంటే.. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్ కి చెల్లి పాత్ర కోసం అనేక మంది హీరోయిన్స్‌ని పరిశీలించరట. చివరకు వైష్ణవి చైతన్య అయితే బాగుంటుందని డైరెక్టర్ డిసైడ్ అయ్యారట. మరి ఇలాంటి సినిమా కోసం హీరోయిన్ కాస్త చెల్లి అయిపోతే .. ఆ తర్వాత మళ్లీ హీరోయిన్ పాత్రలు రావడం ఎంత వరకు సాధ్యం. చెప్పాలంటే ఇంత పెద్ద పాన్ ఇండియా మూవీ.. అందులోను ప్రభాస్ పక్కన పాత్ర అంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. అలా అని కెరీర్‌ని పణంగా పెట్టలేం కాదా.. మరి అది ఆలోచించుకోకుండా వైష్ణవి తప్పు చేస్తుందా ? దీని గురించి పూర్తి అప్డేట్స్ రావాల్సి ఉంది.