మొదటి ఇండియన్ హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. ఖుషీలో ఫ్యాన్స్

by Hamsa |
మొదటి ఇండియన్ హీరోగా సరికొత్త రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. ఖుషీలో ఫ్యాన్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ హిట్స్‌తో బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో సలార్ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన కల్కి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. అలాగే కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతూ.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం డార్లింగ్ కల్కి విజయాన్ని ఎంజాయ్ చేస్తూనే సలార్-2, రాజా డిలక్స్ వంటి చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ సరికొత్త రికార్డు సాధించి ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యాడు.

ఏకంగా మొదటి ఇండియన్ హీరోగా రికార్డు సృష్టించి పాపులారిటీని మరింత పెంచుకున్నాడు. అసలు విషయం ఏంటంటే.. ఆయన నటించిన ఐదు సినిమాలు మొదటి రోజు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డు క్రియేట్ చేశాయి. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. అయితే బాహుబలి-2 రూ. 217 కోట్లు సాధించగా.. కల్కి రూ. 191.5, సలార్ రూ. 178 కోట్లు, ఆదిపురుష్ రూ. 140, సాహో రూ. 130 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించాయి. ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ కావడంతో.. ఇక ఈ విషయం తెలుసుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే మిగతా రెండు సినిమాలు కూడా హిట్ అవుతాయని అభిప్రాయపడుతున్నారు.



Next Story