- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: రిస్క్ చేస్తున్న ప్రభాస్.. అవుట్‌డేటెడ్ జానర్‌లో సినిమా?
దిశ, సినిమా: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన ప్రభాస్.. ఆ తర్వాత నటించిన పాన్ ఇండియా సినిమాలు బాహుబలి, సాహో, సలార్, కల్కి మూవీస్‌తో తన పాపులారిటిని మరింత పెంచుకున్నాడు. అయితే ప్రభాస్‌తో మూవీ అనగానే ఖచ్చితంగా యూనివర్శల్ కాన్సెప్ట్‌తో అందరికి కనెక్ట్ అయ్యే కథ అయ్యి ఉండాలి. ఇక మన డార్లింగ్ తదుపరి చిత్ర కథలు కూడా అలాంటివే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్న ‘స్పిరిట్’ చిత్రంలో పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ప్రభాస్.. హనురాఘవ పూడి సినిమాలో సైనికుడిగా కనిపించబోతున్నాడు. అయితే మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ నటిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’. ఈ మూవీ హారర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌లో రూపొందుతోంది. ఇది ఇంతవరకు ప్రభాస్ టచ్ చేయని జోనరే కావచ్చు.
కానీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ తరహా చిత్రాలు ఇప్పుడు ప్రేక్షకులకు అంతగా రుచించడం లేదు. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న భాషల్లో ఈ జోనర్ సినిమాలు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే ప్రభాస్ ఇప్పుడు టైటిల్ గ్లింప్స్ విడుదలైన తరువాత మారుతి డార్లింగ్‌తో ఎంచుకున్న ఈ జోనర్ కరెక్టేనా? ఇది ఎంత వరకు సేఫ్ అని కామెంట్స్ చేస్తున్నాయి సినీవర్గాలు. ఇటీవల వచ్చిన హారర్ రొమాంటిక్ కామెడీ జోనర్‌లకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదు.
అంతే కాకుండా ఇలాంటి కథలు యూనివర్శల్‌గా అన్ని భాషల వారిని మెప్పించడం కష్టమే.. అయితే కాదు ఇందులో దర్శకుడు మారుతి మ్యాజిక్ ఏమైనా వర్కవుట్ అవుతుందో వేచి చూడాలి. ఏప్రిల్ 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు నలబై శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఆగస్టు 2 తేది నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ భారీ షెడ్యూల్‌లో హీరోపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.