Prabhas Marriageఆ అమ్మాయి కారణంగానే పెళ్లికి దూరంగా ఉంటున్న ప్రభాస్?

by samatah |   ( Updated:2022-12-29 09:46:40.0  )
Prabhas Marriageఆ అమ్మాయి కారణంగానే పెళ్లికి దూరంగా ఉంటున్న ప్రభాస్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈయన బహుబళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. అయితే ప్రభాస్‌కు సంబంధించిన ఓ న్యూస్ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతూనే ఉంటుంది. అది ఏమిటంటే ప్రభాస్ పెళ్లి.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఈయనే. తాజాగా మన రెబల్ స్టార్‌కు సంబంధించిన ఓ గాసిప్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉండటానికి ఓ బలమైన కారణం ఉన్నదంట. అదేమిటంటే.. ప్రభాస్ కి ఇండస్ట్రీ పరంగా కాకుండా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారట. ఆయన పేరు రవి. అయితే అతను, ప్రభాస్ చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే రవి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడంట. కానీ ఆ అమ్మాయి అతన్ని మోసం చేసి వెళ్లిపోయిందంట. దీంతో రవి మానసింగా చాలా డిస్ట్రాబ్ అయ్యాడంట. ఆసమయంలో ప్రభాస్ తన పక్కనే ఉంటూ తనను మాములు పరిస్థితికి తీసుకరావడానికి చాలా ట్రై చేశాడంట. అలా 2 సంవత్సరాల తర్వాత రవి మాములు స్థితికి వచ్చాడంట. ఇక ఈ సంఘటనతో ప్రభాస్కు అమ్మాయిలు అంటే ఇష్టం పోయిందంట. ఇక రవి ప్రేమించిన అమ్మాయి కారణంగా ప్రభాస్ పెళ్లికి దూరంగా ఉంటున్నాడంటూ.. రెబల్ హీరో తల్లి సన్నిహితులకు తెలిపినట్టూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కానీ ఈ వార్తలో ఎంత నిజం ఉందో క్లారిటీగా తెలియదు.

Advertisement

Next Story

Most Viewed