టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

by Hamsa |   ( Updated:2023-06-12 06:24:47.0  )
టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్
X

దిశ, వెబ్ డెస్క్: టాంజానియా యూట్యూబర్ కిలి పాల్ గురించి సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండేవారికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. భారతీయ సినిమాల్లోని పాటలను అనుకరిస్తూ డ్యాన్స్ చేయడంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా కిలి పాల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ రామ్ సీయా రామ్ హిందీ వెర్షన్‌లో కిలి పాల్ పాడారు. ఈ వీడియో నెట్టింట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని ఆదిపురుష్ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ఈ పాట ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను ఏకం చేస్తోందని’’ రాసుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Also Read: టాంజానియా వాసి నోట.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ పాట వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

Advertisement

Next Story