REBEL STAR PRABHAS: ప్రభాస్‌తో జతకట్టనున్న పాకిస్థానీ బ్యూటీ! ఎంత అందంగుందో.. ఓ మైకంలో మునిగితేలుతోన్న ఫ్యాన్స్..?

by Anjali |
REBEL STAR PRABHAS: ప్రభాస్‌తో జతకట్టనున్న పాకిస్థానీ బ్యూటీ! ఎంత అందంగుందో.. ఓ మైకంలో మునిగితేలుతోన్న ఫ్యాన్స్..?
X

దిశ, సినిమా: వరుస అపజయాలను చవిచూసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల తెరకెక్కిన ‘కల్కి 2898’ చిత్రంతో భారీ హిట్ కొట్టి.. ఊహించని రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టారు. ఇక దర్శకుడు నాగ్ అశ్విన్ గురించైతే చెప్పనవసరం లేదు. ఎక్కడ చూసిన ఈయన పేరే జపంలాగా వినిపిస్తుంది. ఒక్కో సన్నివేశాన్ని ఆ రేంజ్‌‌లొ చూపించాడు మరీ.

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్, దిశా పటానీ పలువురు నటీనటులు కూడా అదిరిపోయే ఫార్మామెన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్దల్ని చేశారు. ఆ తరహా మూవీ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ కూడా తీయని విధంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. కల్కి హిట్‌తో ప్రభాస్‌కు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేయడానికి పాన్ ఇండియా స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆల్రెడీ ఈ చిత్రానికి సంబంధించి వర్క్ కూడా నడుస్తోందని నెట్టింట టాక్.

రెబల్ స్టార్ ఆర్మీ సైనికుడిగా కనిపిస్తోన్న ఈ సినిమాలో పాకిస్థానీ కథానాయికను తీసుకోనున్నారట. ప్రస్తుతం దర్శక, నిర్మాతలు ఇదే విషయంపై దీర్ఘ చర్చలు పెడుతున్నారట. మరీ తను ఎవరో కాదు.. వ్రీదేవి మామ్ సినిమాలో అద్భుతంగా నటించిన సాజల్ అలీ. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ ఓ మైకంలో మునిగితేలుతూ.. ఎరిగిగంతులేస్తున్నారు. ప్రభాస్-సాజల్ కెమిస్ట్రీ అదిరిపోతుందంటూ హ్యాపీ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed