చెల్లెళ్ళతో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా.. కల్కి సాంగ్ షూట్‌లో హంగామ

by Kavitha |
చెల్లెళ్ళతో ప్రభాస్ అల్లరి మాములుగా లేదుగా.. కల్కి సాంగ్ షూట్‌లో హంగామ
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కల్కి, రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2.. ఇవి కాకుండా బాలీవుడ్ సినిమా ఒకటి చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభాస్ సినిమాల గురించి పక్కన పెడితే.. డార్లింగ్ చాలా ఇంట్రోవర్ట్. బయట ఎక్కడా ఎక్కువ మాట్లాడాడు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో అయితే రెండు మూడు ముక్కలు కంటే ఎక్కువ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు.

డార్లింగ్ కు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఎంతో రేర్ గా మాట్లాడతాడు. కానీ, తన దగ్గర వాళ్ళతో కానీ, కుటుంబంతో కానీ ఎంతో క్లోజ్ గా ఉంటాడు. అయితే రెబల్ స్టార్ కృష్ణంరాజుకి ముగ్గురు కూతుర్లు ఉన్న విషయం తెలిసిందే. ఆ ముద్దుల తనయల పేర్లు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి. ప్రస్తుతం వారు వారి వారి కెరీర్ లో బిజీగా ఉన్నారు. పెద్ద అమ్మాయి సాయి ప్రసీద నిర్మాణ రంగంలో మెళకువలు నేర్చుకుంటుంది. మిగిలిన ఇద్దరు చదువు మీద దృష్టి పెట్టారు. చిన్నతనం నుంచి వీరికి అన్న ప్రభాస్ తో ఉండటం అంటే బాగా ఇష్టం. డార్లింగ్ సైతం చెల్లెళ్లతో గడపడాన్ని బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇక పెదనాన్న కృష్ణంరాజు చనిపోయిన దగ్గరనుంచి వారికి అన్న అయినా, తండ్రి అయినా ప్రభాసే అయ్యి వారిని చూసుకుంటున్నాడు.

తాజాగా ఈ ముగ్గురు.. కల్కి సెట్ లో సందడి చేశారు. ఈ మధ్యనే భైరవ ఆంథెమ్ కు సంబంధించిన షూట్ జరిగింది. ఆ సెట్ లో సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి తో డార్లింగ్ భల్లే భల్లే స్టెప్స్ వేసాడు. వీరితో పాటు పంజాబీ సింగర్ దల్జీత్ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ అన్నాచెల్లెళ్లు ఎప్పుడు ఇలాగే కలిసి మెలసి ఉండాలని అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed