ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన ప్రభాస్.. వదినమ్మ రాబోతుందని పోస్ట్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ

by Sujitha Rachapalli |
ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్పిన ప్రభాస్.. వదినమ్మ రాబోతుందని పోస్ట్.. వైరల్ అవుతున్న ఇన్‌స్టా స్టోరీ
X

దిశ, సినిమా: రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ రీసెంట్ గా ' సలార్ ' తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. డార్లింగ్ దెబ్బకు పోటీగా వచ్చిన బాలీవుడ్ మూవీస్ కూడా తోక ముడిచాయి. ఇదిలా ఉంటే 'Kalki 2898 AD', ' రాజా సాబ్ ', ' స్పిరిట్ ' సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టేసిన హీరో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. 'డార్లింగ్స్.. ఫైనల్లీ వెరీ స్పెషల్ పర్సన్ జీవితంలోకి ఎంటర్ కాబోతుంది. వెయిట్ చేయండి' అంటూ పోస్ట్ పెట్టాడు.

ఇక ఈ పోస్ట్ పై నిమిషాల్లోనే మిలియన్ కు పైగా అభిమానులు స్పందించారు. ఫైనల్ గా వదినమ్మ రాబోతుందిరా అనుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరికొందరు ఇంకా నమ్మలేక పోతున్నారు. అన్న వచ్చి మళ్లీ ఎకౌంట్ హ్యాక్ అయిందని చెప్తాడేమో.. స్పెషల్ పర్సన్ అనేది ఏమీ ఉండదు అని చెప్తున్నారు. మొత్తానికి ఈ మ్యాటర్ ప్రజెంట్ టాక్ ఆఫ్ ది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాగా ఇంకొందరు ఏదైనా మూవీ అప్ డేట్ అయి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.




Advertisement

Next Story