ప్రభాస్ ‘Kalki 2898 AD’ అప్డేట్ రిలీజ్.. అశ్వత్థామగా స్టార్ హీరో లుక్స్ అదుర్స్

by Hamsa |   ( Updated:2024-04-22 10:04:56.0  )
ప్రభాస్ ‘Kalki 2898 AD’ అప్డేట్ రిలీజ్.. అశ్వత్థామగా స్టార్ హీరో లుక్స్ అదుర్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ‘కల్కి2898 ఏడి’ సినిమా రాబోతుంది. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే స్టార్ట్ అయి చాలా రోజులవుతున్నాయి. అయితే కల్కి నుంచి మాత్రం పోస్టర్స్, గ్లింప్స్ విడుదలయ్యాయి. అయితే కల్కి మే నెలలో విడుదల కావాల్సి ఉండగా.. ఎన్నికల కారణంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, కల్కి2898 ఏడి నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ విడుదల చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ లుక్స్‌ను రిలీజ్ చేస్తూ గ్లింప్స్‌ను వదిలారు. ఇందులో ఆయన అశ్వత్థామగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read More..

గుండె బరువెక్కిందంటూ హీరో నాని ఎమోషనల్ పోస్ట్.. కారణం అదేనా?


Advertisement

Next Story