Prabhas: సుభాస్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న డైరెక్టర్ ప్లాన్?

by sudharani |
Prabhas: సుభాస్ చంద్రబోస్ పాత్రలో ప్రభాస్.. క్యూరియాసిటీ పెంచేస్తున్న డైరెక్టర్ ప్లాన్?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల వచ్చిన ‘కల్కి 2898ఏడీ’తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు. జూన్ 27న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 1100 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇంకా కొన్ని చోట్ల ఈ చిత్రం థియేటర్లలో సందడి చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న వరుస పాన్ ఇండియా మూవీల నుంచి అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి.

మన డార్లింగ్ చేతిలో ప్రజెంట్.. సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’, ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’, నాగ్ అశ్విన్ ‘కల్కి 2’తో పాటు.. మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ చేస్తున్నాడు. ఇందులో నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఈ మూవీస్ తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి తీయబోతున్న ‘ఫౌజీ’ చిత్రంలో నటిస్తారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాకుండా ఇందులో రెబల్ స్టార్ ‘సుభాష్ చంద్రబోస్’ పాత్రలో నటిస్తారని గత కొద్ది కాలంగా నెట్టింట వార్తల చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ మాత్రం రాలేదు. కాగా.. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story