'Unstoppable 2 'షోకు Prabhas.. అభిమానుల హంగామా

by Harish |
Unstoppable 2 షోకు Prabhas.. అభిమానుల హంగామా
X

దిశ, సినిమా: ఓ వైపు యువ హీరోలకు పోటిగా వరుస సినిమాల్లో అదరగొడుతున్న బాలయ్య మరోవైపు టాక్ షోలతోనూ కేక పెట్టిస్తున్నాడు. 'ఆహా'లో వేదికగా ప్రసారమవుతున్న 'అన్‌స్టాపబుల్ 2'షో విజయవంతంగా రన్ అవుతోంది. తాజాగా ఐదో ఎపిసోడ్ కోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు వచ్చారు. తర్వాత ప్రభాస్‌‌తో నెక్ట్స్ ఎపిసోడ్ ప్లాన్ చేసిన టీమ్ ఇందుకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌తో పాటు ఆయన స్నేహితుడైన మరో హీరో గోపీచంద్‌ కూడా రానున్నట్లు తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఈ ఎపిసోడ్ తాలూకు షూటింగ్ ఈ నెల 11న ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. నిజానికి చాలామంది దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే.. షో సెట్ బయట ప్రభాస్ అభిమానులు హంగామా చేశారు. జెండా పట్టుకొని ర్యాలీలు చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read...

"Kantara' to be released in English



Next Story