షాకింగ్ న్యూస్.. స్టార్ హీరోల మధ్య వివాదం.. గోపీచంద్‌ ముక్కు పగలగొట్టిన ప్రభాస్‌! ఎందుకంటే?

by Disha Web Desk 9 |
షాకింగ్ న్యూస్.. స్టార్ హీరోల మధ్య వివాదం.. గోపీచంద్‌ ముక్కు పగలగొట్టిన ప్రభాస్‌! ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండస్ట్రీకి రాకముందే ప్రభాస్-గోపిచంద్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా.. గోపిచంద్ విలన్ పాత్రలో నటించారు. ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో ఏ మూవీ రాలేదు. ఇప్పుడు మళ్లీ వీరు కలిసి సినిమా చేద్దామనే ప్లాన్‌లో ఉన్నారని సమాచారం. ఇకపోతే ప్రభాస్ .. గోపిచంద్ ముక్కు పగలగొట్టారంటూ నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ నవ్వితే పక్కకున్న మనుషుల్ని నెట్టే, కొట్టే అలవాటు ఉందట. కాగా అలా గోపిచంద్ ను రెబల్ స్టార్ నెట్టడం, కొట్టడం చేస్తుండగా ఓ రోజు ముక్కు పగిలిందట. అరేయ్ ఈ రోజు నవ్వితే నన్ను కొట్టొద్దని ముందే చెప్పాడట. అయిన కూడా ప్రభాస్ వినిపించుకోకుండా కొట్టాడట. దీంతో గోపిచంద్ ముక్కు నుంచి రక్తం వచ్చిందట. ఈ విషయాన్ని బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ షో కు హాజరైన ప్రభాస్ -గోపిచంద్ బయటపెట్టారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed