- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
‘కన్నప్ప’ కోసం శివుడిలా ప్రభాస్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్
దిశ, వెబ్‌డెస్క్: హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీలో శివుడి పాత్రలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్నట్లు ఇటీవల పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భక్త కన్నప్ప కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. అయితే ఈ సినిమా రూ. 100 కోట్లతో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొంతుంది. అంతేకాకుండా న్యూజిలాండ్‌లో షూటింగ్ కోసం కంటైనర్ల సెట్ ప్రాప్స్ కూడా రవాణా చేయబడ్డాయని మంచు విష్ణు ఓ పోస్ట్‌ను కూడా షేర్ చేశాడు.
తాజాగా, ప్రభాస్ ఫ్యాన్స్ ఏఐ సాయంతో శివుడి గెటప్‌లో రెడీ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో శివుడి వేశంలో ప్రభాస్ లుక్స్ చూసిన వారు ఫిదా అయిపోతున్నారు. అంతేకాకుండా సినిమాలో కూడా ఇలాగే చూపించండి అంటూ ఫ్యాన్స్ మంచు విష్ణును రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. ఇక ఈ మూవీలో పార్వతిగా నయనతార నటిస్తుందని సమాచారం.