డివోష‌న‌ల్ థ్రిల్లర్.. ఆది ‘షణ్ముఖ’ నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్

by sudharani |
డివోష‌న‌ల్ థ్రిల్లర్.. ఆది ‘షణ్ముఖ’ నుంచి పవర్‌ఫుల్ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: ఆది సాయికుమార్, అవికాగోర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘ష‌ణ్ముఖ’. పవర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్పని ద‌ర్శకత్వం వహిస్తున్నాడు. సాప్పని బ్రదర్స్ స‌మ‌ర్పణ‌లో తుల‌సీరామ్ సాప్పని, ష‌ణ్ముగం సాప్పని, ర‌మేష్ యాద‌వ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఇందులో నుంచి ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ ఉత్కంఠగా నడిచివస్తున్న ఈ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతుంది.

ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్‌గా ఆది నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా డైరెక్టర్ మ‌ట్లాడుతూ 'ఇదొక డివోషనల్‌ థ్రిల్లర్‌. ప్రతి సన్నివేశంలోనూ ఓ పాజిటివ్‌ వైబ్‌, మ్యాజిక్‌ ఉంటుంది. ఇప్పటి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో మెస్మరైజ్‌ చేసే విధంగా ఉటుంది. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీని అన్ని భాషల్లో ఒకేసారి అక్టోబర్‌లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చాడు.



Next Story