‘బచ్చల మల్లి’ నుంచి పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్ ‘పుష్ప’ లెక్కనే అల్లరి నరేష్!

by Javid Pasha |
‘బచ్చల మల్లి’ నుంచి పోస్టర్ రిలీజ్.. అల్లు అర్జున్ ‘పుష్ప’ లెక్కనే అల్లరి నరేష్!
X

దిశ, సినిమా : అల్లరి నరేష్ అంటేనే అదో లెక్క. ఏ సినిమా తీసినా కడుపుబ్బా నవ్వించే కామెడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో తనకంటూ స్పెషల్ ఫేమ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇటీవల కాస్త రూటు మార్చి మరింత ఆకట్టుకునే సరికొత్త చిత్రాలతో హిట్ కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లరోడు హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న మరో మూవీ ‘బచ్చల మల్లి’తో మన ముందుకు రాబోతోంది. సుబ్బు మంగాదేవి డైరెక్షన్‌లో హాస్యా మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా, గుత్తా బాలాజీ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది.

ఇకపోతే బచ్చల మల్లి మూవీ నుంచి ఇప్పటికే అల్లరి నరేష్ మాస్ లుక్‌లో కనిపించే పోస్టర్ ఒకటి రిలీజ్ చేస్తూ.. ‘పేరు మల్లి, ఇంటి పేరు బచ్చల, చేసేది ట్రాక్టర్ డ్రైవింగ్’ అనే క్యాప్షన్‌తో హీరో క్యారెక్టర్ గురించి చెప్పిన విషయం తెలిసిందే. అయితే జూన్ 30న అల్లరి నరేష్ బర్త్ డే ఉన్నందున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఓ స్పెషల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఇదే విషయంపై క్లారిటీ ఇస్తూ తాజాగా బచ్చల మల్లి సినిమా నుంచి మరోసారి అల్లరి నరేష్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. అయితే ఇందులో అల్లరి నరేష్ లుక్ కాస్త.. అల్లు అర్జున్ లెక్క కనిపిస్తుండటంతో మొదట చూడగానే ‘బన్నీ పుష్ప లెక్క కనిపిస్తున్నాడేంటి?’ అని కామెంట్లు పెడుతున్నారు సినీ లవర్స్.

Advertisement

Next Story

Most Viewed