- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భర్త బతికాడన్న ఆనందం కంటే.. కుక్క చనిపోయిందన్న బాధలో ప్రముఖ నటి (వీడియో వైరల్)
దిశ, సినిమా: సీరియల్స్‌లోనే కాకుండా.. సినిమాల్లో అక్క, అత్త, అమ్మ, వదిన, భార్య పాత్రలు చేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంది షానూర్ సనా బేగమ్. తన యాక్టింగ్‌తో ఇప్పటికి సినిమాలు, సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సనా బేగమ్.. పలు వీడియోలు చేస్తూ నెట్టింట సందడి చేస్తుంటోంది. అయితే.. ఈ మధ్య కాలంలో మాత్రం తన భర్తకు హెల్త్ బాగోలేదంటూ సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే అసలు తన భర్తకు ఏమైందనే విషయంపై ఓ వీడియో రిలీజ్ చేసింది నటి.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను షూటింగ్ నుంచి వచ్చే టైంకి నా భర్త కుడివైపు నొప్పితో బాధపడుతున్నాడు. కుడివైపు నొప్పి రావడంతో మేము గ్యాస్ట్రిక్ ప్రాబ్లెమ్ అనుకున్నాము. ఈనోతో పాటు పలు రకాల జ్యూసులు తాగారు. అయినా ఏ మాత్రం తగ్గలేదు. తర్వాత వాంతులు కూడా కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే.. అక్కడ నా భర్త పరిస్థితి చూసిన డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి అది హాట్ స్ట్రోక్ అని చెప్పారు. వెంటనే వేరే ఆసుపత్రికి తరలించమని సలహా ఇచ్చారు. హాట్ ఎటాక్ వల్ల ముఖంలోని దవడ నుంచి గుండె కింది భాగం వరకు ఎక్కడైనా నొప్పి రావొచ్చని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం నా భర్త కోలుకుంటున్నారు’ అని చెప్పుకొచ్చింది నటి. అంతే కాకుండా ఆయన కోలుకుంటున్నారు అని ఆనందించేలోపే తన పెంపుడు కుక్క (రాక్సీ) చనిపోయిందంటూ ఎమోషనల్ అయింది షానూర్ సనా బేగమ్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తన యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది.