చీర కట్టులో పూనమ్ బజ్వా - హమ్మయ్య బతికించావ్ అంటున్న అభిమానులు

by Kavitha |
చీర కట్టులో పూనమ్ బజ్వా - హమ్మయ్య బతికించావ్ అంటున్న అభిమానులు
X

దిశ, సినిమా: ఒకప్పటి హీరోయిన్ పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ పరుగు, నాగార్జున బాస్ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈ అమ్మడు తెలుగు, తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కానీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో పాటు సినిమా ఆఫర్లు కూడా రాలేదు. దీంతో కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచి బాయ్స్‌కి నిద్రలేకుండా చేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో బ్లూ కలర్ శారీ కట్టుకొని వయ్యారంగా చూస్తూ ఫోటోలకి స్టిల్స్ ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు హమ్మయ్యా చీర కట్టుకొని బతికించావ్.. చాలా రోజులుగా గ్లామర్ డోస్‌తో ఉక్కిరిబిక్కిరి అయిన మాకు ఇన్నిరోజులకు కొంచెం గ్యాప్ ఇచ్చావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
















Next Story

Most Viewed