తండ్రితో నేను బిడ్డను కనలేదు.. ఆమె నా సోదరి: నెటిజన్లపై పూజా ఫైర్

by Prasanna |   ( Updated:2023-09-13 07:30:33.0  )
తండ్రితో నేను బిడ్డను కనలేదు.. ఆమె నా సోదరి: నెటిజన్లపై పూజా ఫైర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి అలియా భట్ తన కూతురు అంటూ ఇటీవల చర్చనీయాంశమైన వార్తలపై పూజా భట్ స్పందించింది. తండ్రి, దర్శకుడు మహేష్‌ భట్‌తో లిప్ లాక్ ఫొటో షూట్‌కు సంబంధించిన కాంట్రవర్సీపై రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన ఆమె.. అలియా భట్ తన కూతురనే పుకార్లను కొట్టిపారేసింది. ‘ఇండియాలో ఇలాంటి ఫేక్ వార్తలు సృష్టించడం ఇదేం కొత్తకాదు. నా విషయంలోనే కాదు ఎంతోమంది జీవితాలను పుకార్లు డిస్ట్రబ్ చేశాయి. ఇలాంటి తప్పుడు వ్యవహారాలకు గౌరవాన్ని కూడా జత చేస్తూ చర్చించడం హాస్యాస్పదం. ఒక సోదరిని కూతురుగా పేర్కొనడం సిగ్గుచేటు చర్య. ఒకే తండ్రికి పుట్టిన పిల్లలను తల్లీ కూతుళ్లుగా ప్రచారం చేయడం అమానుషం. నేను మహేష్ భట్ మొదటి భార్య కూతురిని, అలియా రెండో భార్య బిడ్డ. ఈ విషయం అందరికీ తెలిసినా కావాలనే మాపై బురద జల్లడం అతిపెద్ద జోక్. బుద్ధిలేని వాళ్లే ఇలాంటి చెత్త కామెంట్స్ చేస్తారు’ అంటూ ఫైర్ అయింది పూజా.

Advertisement

Next Story