‘PS 2’ ఆడియో, ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌.. ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్

by sudharani |   ( Updated:2023-03-27 14:45:57.0  )
‘PS 2’ ఆడియో, ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌.. ముఖ్యఅతిథిగా సూపర్ స్టార్
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ మ‌ణిర‌త్నం ఆవిష్కరిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ ‘పొన్నియిన్ సెల్వన్ 2’. లైకా ప్రొడ‌క్షన్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌పై సుభాస్కర‌న్‌, మ‌ణిర‌త్నం ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈ రెండో భాగంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొనగా తాజాగా మరో బిగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న ఆడియో, ట్రైల‌ర్ లాంచ్ వేడుక‌ ఘ‌నంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కమల్ హాసన్ హాజరుకానున్నట్లు ప్రకటించారు. ఇక ఐదు భాష‌ల్లో తెరకెక్కుతున్న మూవీలో విక్రమ్, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్యా రాయ్‌, త్రిష‌, జ‌య‌రామ్ త‌దిత‌రులు కీల‌క పాత్రలు పోషిస్తుండగా.. ఏప్రిల్ 28న ఈ చిత్రం విడుదలకానుంది.

Also Read...

‘రావణాసుర’లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది: రైటర్ శ్రీకాంత్ విస్సా

Advertisement

Next Story