- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నటి ఎఫెక్ట్ : 15 యూబ్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లకు పోలీసుల నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో : తన పర్సనల్ విషయాలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టి వేధిస్తు్న్నారని నటి పవిత్రా లోకేష్ శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి పవిత్రా ఫిర్యాదు మేరకు సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. 15 యూబ్యూబ్ చానళ్లు, వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని యూట్యూబ్ చానళ్లకు ఆదేశించారు. కాగా, శనివారం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన నటి పవిత్రా 15 యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్ల లింకులను ఇచ్చింది. నటుడు నరేశ్ గురించి తన గురించి కొంతమంది టీవీ ఛానల్స్, యూబ్యూబర్స్ తమను టార్గెట్‌గా చేసుకుని అభ్యంతకర కామెంట్స్‌తో పాటు తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వేధిస్తు్న్నారని తెలిపింది. వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని నటి సూచించగా పోలీసులు ఆ పనిలో పడ్డారు.
కాగా, ఇప్పటికే యాంకర్స్, హీరోయిన్లపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, కామెంట్స్ రాస్తున్నారని గతంలో నటి అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఓ వ్యక్తిని సైబరాబాద్ సైబర్క్రైమ్పోలీసులు అరెస్ట్‌చేశారు. ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజు(30) మూడేండ్ల పాటు దుబాయ్‌లో ప్లంబర్‌గా వర్క్ చేశాడు. తర్వాత సిటీకి వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలోజాబ్ చేస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్‌లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడు. దీనిపై ఈ నెల 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు శనివారం వీర్రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Read more :
- Tags
- Pavitra Naresh