Aishwarya Rajesh :హీరోయిన్‌ కు బెదిరింపులు..ఇంటి బయట మోహరించిన పోలీసు

by Prasanna |   ( Updated:2023-05-19 12:31:53.0  )
Aishwarya Rajesh :హీరోయిన్‌ కు బెదిరింపులు..ఇంటి బయట మోహరించిన పోలీసు
X

దిశ, సినిమా : తమిళ్ ఫిల్మ్ ‘ఫర్హానా’ వివాదంలో చిక్కుకుంది. ముస్లిం మహిళలు, హిజాబ్‌ను కించపరిచేలా ఉందని ఇస్లామిక్ గ్రూపులు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్లాం స్త్రీగా మెయిన్ రోల్ ప్లే చేసిన హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్‌కు బెదిరింపులు రాగా.. ఆమె నివాసం వెలుపల పోలీసు బలగాలు మోహరించాయి. మే 14న ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఇలాంటి విమర్శలు మొదలుకాగా మే 12న సినిమా విడుదలయ్యాక మరింత వ్యతిరేకత ఏర్పడింది. ఈ చిత్రంలో ముస్లిం కమ్యూనిటీని చెడుగా చూపించారని, ఇండియన్ నేషనల్ లీగ్‌తో సహా పలు ఇస్లాం గ్రూప్స్ ఫైర్ అవుతున్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఐశ్వర్య.. మతం ఎప్పుడూ ఆలోచించాల్సిన అంశం కాదని.. హిందువు అయినా, క్రిస్టియన్ అయినా ఈ పాత్రలో నటించి ఉండేదాన్నని చెప్పుకొచ్చింది.

Read more:

2023 Cannes Film Festival: మొదటి ప్రాంతీయ జానపద కళాకారిణి.. అబ్బురపరిచిన Sapna Choudhary

Advertisement

Next Story

Most Viewed