- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vijay Varma: ‘ప్లీజ్ దుఖంలో ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి’.. విజయ్ వర్మ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 11 వ తేదీన మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. గురువారం ముంబయిలో అనిల్ అరోరా (65) అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. తీవ్ర దుఖంలో మునిగిపోయిన మలైకాను ఓదార్చారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు.
‘మలైకా అరోరా బయట ఎక్కడ కనిపించినా ప్రశ్నలు అడుగుతూ ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఇది నా విజ్ఞప్తి. ప్లీజ్ దుఖంలో ఉన్న కుటుంబాన్ని ఒంటరిగా వదిలేయండి. ఆ బాధలో నుంచి కోలుకోవడం వారికి అంత సులభం కాదు. వారికి అత్యంతమైన కష్టమైన సమయమిది. దయచేసి మీడియా వ్యక్తులు మలైకా కుటుంబంపై దయ చూపండి’ అంటూ విజయ్ వర్మ ట్వీట్ చేశారు.
ఇంటి టెర్రస్‌పై నుంచి దూకిన తండ్రి అనిల్ అరోరా అంత్యక్రియల సమయంలో మలైకాను మీడియా వారు ఫొటోలు తీయడంపై వరుణ్ ధావన్ మీడియా వారిపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. అవతలి వ్యక్తులు ఎంత బాధలో ఉన్నారో అర్థం చేసుకోండి. మీ పనిని నేను అర్థం చేసుకుంటాను. కానీ పక్కవారి గురించి కూడా కొంచెం ఆలోచించండి అంటూ వరుణ్ ధావన్ మండిపడ్డారు.